
గురుకుల పాఠశాలకు వాటర్ ట్యాంక్ వితరణ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన షేక్ పేట్ గురుకుల పాఠశాలకు ప్రొగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ రాష్ట్ర నాయకులు, షేక్పేట పాఠశాల కమిటీ గౌరవ అధ్యక్షులు సూరపల్లి నాగమల్లేశ్వర రావు తాగునీరు కోసం సింటెక్స్ వాటర్ ట్యాంకు వితరణ చేశారు. వాటర్ ట్యాంక్ అవసరాన్ని గుర్తించిన పేరెంట్ నాగమల్లేశ్వరరావు సుమారు 2 వేల లీటర్ల కెపాసిటీ కలిగిన త్రాగునీరు ట్యాంక్ ను కొనుగోలు చేసి ప్రిన్సిపాల్ బాలస్వామికి శుక్రవారం అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ బాలస్వామి మాట్లాడుతూ పాఠశాల సమస్యలపై తల్లిదండ్రులు స్పందించి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో పాఠశాల పిడి హరికిషన్, ఉపాధ్యాయుడు నాగరాజు, పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు స్వర్ణ సురేష్, పేరెంట్స్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.