
‘అక్షిత’ ఎగ్జిక్యూటివ్ డైరీ ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అక్షిత జాతీయ దినపత్రిక వారు రూపొందించిన ఎగ్జిక్యూటివ్ డైరీని హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ తో కలిసి మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్షిత చీఫ్ ఎడిటర్ మాతంగి దాస్ కు, పత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్లకు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరునగర్ భార్గవ్ మాట్లాడారు. పార్టీలకు అతీతంగా నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రిక అక్షిత అని అభినందించారు. వార్తా సేకరణలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. అక్షిత చీఫ్ ఎడిటర్ మాతంగి దాస్ ఇటీవల ప్రారంభించిన అక్షిత ఛానల్ అనతికాలంలో విశేష ప్రజాదరణ పొందిందదన్నారు. ఎప్పటికప్పుడూ తాజా సమాచారాన్ని అందిస్తోందన్నారు. మీడియా రంగంలో విశేష పేరొందిన అక్షిత చీఫ్ ఎడిటర్ మాతంగి దాస్ మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందినవారు కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కృషి, పట్టుదల, అంకిత భావంతో ఆయన ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు తిరునగర్ భార్గవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు ఉదయ్ భాస్కర్, ఖాదర్, అమృతం సత్యం, కందగట్ల అశోక్, శ్రీపతి శ్రీనివాస్, బాబా షర్ఫోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.