మహనీయుల అడుగుజాడల్లో పయణించాలి

విద్యార్థులు నవ సమాజ నిర్మాతలుగా ఎదగాలి
* మహనీయుల అడుగుజాడల్లో పయణించాలి
* హమీద్ షేక్ సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం
* గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు ప్రదానం 

మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

విద్యార్థులు నవ సమాజ నిర్మాతలుగా ఎదగాలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్ ఆకాంక్షించారు. యువత, విద్యార్థులు మహనీయుల అడుగుజాడల్లో పయణించాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పట్టణ స్థాయిలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు.

ఆదివారం ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్ నివాసం వద్ద బహుమతులను, పతకాలను ప్రదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరునగర్ భార్గవ్ మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు గత రెండు దశాబ్దాల నుంచి ప్రఖ్యాత స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ నిర్వర్తిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అభినందించారు.

అనంతరం వ్యాసరచన పోటీలో పట్టణ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన అభ్యాస్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని ఎల్.అక్షతను, ద్వితీయ బహుమతి పొందిన నేతాజీ హై స్కూల్ విద్యార్థి కె.గౌతమ్ లను తిరునగర్ భార్గవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉదయ్ భాస్కర్, ఖాదర్, అమృతం సత్యం, కందగట్ల అశోక్, నేతాజీ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీపతి శ్రీనివాస్, బాబా షర్ఫోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking