*న్యాయ చట్టాలపై అవగాహన కలిగి యుండాలి

*న్యాయ చట్టాలపై

అవగాహన కలిగి యుండాలి

*నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండల పెద్ద మునిగాలలో న్యాయ సేవల సదస్సు,హాజరైన రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్ రావు,జస్టిస్ కె.లక్ష్మణ్

పెద్ద మునిగాల, అక్షిత ప్రతినిధి :

న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర న్యాయ సేవాధి కార సంస్థ ఎగ్జి కూటివ్ చైర్మన్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు అన్నారు.ఆదివారం జిల్లా న్యాయ సేవాధికర సంస్థ,మండల న్యాయ సేవాదికర కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నేరేడు గొమ్ము మండలం పెద్ద మునిగల్ గ్రామంలో నిర్వహించిన న్యాయ సేవల సదస్సు లో ముఖ్య అతిథి గా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ద్వారా ప్రభుత్వం చేసిన చట్టాలు,రాజ్యాంగం కల్పించిన హక్కుల పై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని,,గ్రామీణ ప్రాంత ప్రజలు,ముఖ్యంగా గ్రామీణ మహిళలకు అవసరం అని అన్నారు.చట్టాల పై అవగాహన వుంటేనే మన చుట్టూ వున్న సామాజిక రుగ్మతలు,సమస్యల ను పరిష్కరించు కోవచ్చని అన్నారు.మండల స్థాయి నుండి మండల న్యాయ సేవాధి కార సంస్థ ,జాతీయ స్థాయి వరకు
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ లు పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కోర్టు కు రాక ముందే ప్రీ లిటి గేషన్ దశ లోనే కేసులు పరిష్కారం అవుతున్నాయని అన్నారు.కోర్టుకు రాక ముందే వివాదాలు సెటిల్ కావడం సమయం, డబ్బు అవుతుంది అన్నారు. ఆర్థిక స్తోమత లేని వారికి లాయర్ ను ఏర్పాటు చేసి కోర్ట్ లో కేసు వాదించేందుకు కూడా సహాయ పడ నున్నట్లు తెలిపారు.నేరం నమోదు కాబడి జైళ్ల లో మగ్గుతున్న వారికి, ట్రయల్ స్టేజి లో, బెయిల్ గ్రాంట్, అప్పీల్ చేసేందుకు కూడా సహాయం అందించనున్నట్లు తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రత్యేకంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో దేవరకొండ చుట్టూ పక్కల ప్రాంతం లో బాల్య వివాహాలు,భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నవని అన్నారు.గర్భవతి అయిన తర్వాత కష్టాలు వస్తాయని పుట్టక ముందే ఆడ శిశువు అని తెలుసుకుని చంపడం సరి కాదని,శిశువు ను కనడం భగవంతుడు ఇచ్చిన వరం అన్నారు.భవన నిర్మాణ కార్మికులకు సరైన వసతులు,వేతనం కల్పించాలని కార్మిక చట్టాలు, వయో వృద్ధుల సంరక్షణ కు వయో వృద్ధుల సంరక్షణ చట్టంలు ఎన్నో చట్టాలు వున్నాయని,న్యాయ సేవాదికార సంస్థ ద్వారా న్యాయ సదస్సు లు నిర్వహించి చట్టాల పై అవగాహన కలిగించ నున్నట్లు తెలిపారు. వ్యవసాయం పై ఆధారపడిన వారు ఎక్కువగా ఉన్నారని,రాబోయే రోజుల్లో భూమి సంబంధిత హక్కుల సమస్యలు పరిష్కారం చేసుకునేలా,నకిలీ విత్తనాలు వలన మోసపోతే ఎం చేయాలి తదితర సమస్యలపై గ్రామ స్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.విద్యార్థినులు చుట్టూ వున్న సమస్యలపై తల్లి దండ్రులకు అవగాహన కలిగించాలని ధైర్యంగా సమస్య ఎదురు కోవాలని,ప్రభుత్వం ఉచిత విద్య,ఉపాధి అవకాశాలు కల్పిస్తోంద ని అన్నారు.విద్యార్థినులు, అంగన్ వాడి టీచర్ లతో మాట్లాడి వారు గమనించిన సమస్యలు,ఎలా స్పందించారు ఆన్న విషయం పై న్యాయ మూర్తి ముఖాముఖి సంభాషించి తెలుసుకున్నారు.కేవలం చట్టాల ద్వారానే కాకుండా మన లో మార్పు రావాలని అన్నారు. రాష్ట్ర హై కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసిందని అదేవిధంగా స్థాయి కొట్టు ప్రజలకు సత్వర నయం అందించేందుకు జ్యుడిషియల్ జిల్లాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు.నిత్య జీవితం లో ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యలు పరిష్కారం కు చట్టాల పై అవగాహన అవసరం అన్నారు. ఉదాహరణకు అధిక కరెంట్ బిల్ వస్తె ఏం చేయాలి వినియోగదారుల రక్షణ చట్టం ధర వినియోగదారుల ఫోరం లో రక్షణ పొందవచ్చని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాల వల్ల భూమి కోల్పోయిన వారికి పరిహారం ఉపాధి కల్పించేందుకు కూడా చట్టాలు ఉన్నాయని అన్నారు. చిరు వ్యాపారం చేసుకునే వారికి కూడా వెండింగ్ జోన్ ఏర్పాటుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చట్టాలు ఉన్నాయని తెలిపారు.. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్రభుత్వం శాఖల ద్వారా అందుతున్న పథకం.ల గురించి ,సేవల గురించి జిల్లాలో పర్యవేక్షణ చేస్తుందని అన్నారు.సుప్రీం కోర్ట్ ప్రధాన ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు,హై కోర్ట్ తీర్పులను మాతృ భాష లో అనువదించాలని వినూత్న కార్యక్రమం 12 భాషల్లో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి నట్లు,ఇందులో తెలుగు కూడా వున్నట్లు తెలిపారు.దీనిపై కమిటీ నియమించారని ఈ కమిటీలో నేను,హై కోర్ట్ న్యాయమూర్తి నవీన్ రావు గారు సభ్యులుగా వున్నట్లు తెలిపారు.ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 40 శాతం అనువాదం అయిందని అన్నారు.
టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఉపయోగించి కోర్టు లో జరిగే వాదనలను లైవ్ స్ట్రీమింగ్ స్మార్ట్ ఫోన్లో వీక్షించే అవకాశం వారం రోజుల క్రితం మొదలైందని ఆయన తెలిపారు. ధ్రువ తెలుగు మహా పాపమని ఆయన అన్నారు పిల్లలను సంరక్షణం చేయలేని పరిస్థితిలో బదులువేయాలనుకుంటే పిల్లలను అప్పగించాలని ప్రభుత్వమే వారి బాధ్యతలు చూసుకుంటుందని తెలిపారు. దేశంలో 140 కోట్ల వుందని, భిన్న మతాలు, భిన్న కులాలు వున్న దేశం లో ప్రభుత్వం ఒక్కటే చేయలేదని,ప్రతి ఒక్కరూ హక్కుల తో పాటు బాధ్యతలు నిర్వర్తించాలని అన్నారు.బాల్య వివాహాలు చేయ వద్దని, తల్లి దండ్రుల పోషణ పిల్లల బాధ్యత అని అన్నారు.చెట్లు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యత అని,చెట్ల నాటడం పండగ లాగా నిర్వహించి ఇంటి
గ్రామంలో చెట్లు నాటాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం లో గర్భస్థ లింగ నిర్థారణ పరీక్షలు చేయడం ,బాల్య వివాహాలు,చట్ట బద్దత లేకుండా దత్తత ఇవ్వడం,భూ సమస్యలు ఉన్నాయని అన్నారు.పుట్టిన శిశువు పోషించనీ పరిస్థితి వుంటే
ప్రభుత్వం నిర్వహిస్తున్న దత్తత కేంద్రం లో శిశువు ను అప్పగించాలని అన్నారు.చట్ట ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఎంతో మంది దత్తత కోసం దరఖాస్తు లు చేసుకుని వేచి ఉన్నారని అన్నారు.అబార్షన్ లు చేయడం చట్ట విరుద్ధం అని అన్నారు.ప్రభుత్వం 2015 ముందు పోడు సాగు లో వున్నా వారికి పట్టాలు అంద చేయ నున్నట్లు,అడవులు నరికి వేయ వద్దు అని,అతి తక్కువ అటవీ విస్తీర్ణం వున్న జిల్లాల్లో నల్గొండ కూడా వుందని అన్నారు.ప్రభుత్వం ద్వారా భూముల సమస్యలు,బాల్య వివాహాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు వివరించారు. జిల్లా ఎస్.పి.అపూర్వ రావు మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలు అల్ట్రా స్కానింగ్ నేరమని,చట్ట రీత్యా చర్యలు,జైలు శిక్ష వుంటుందని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నరని,ఉన్నత స్థానం లో వుండే మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్ జడ్జి బి.ఎస్. జగ్జీవన్ కుమార్, దేవరకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. రమా శంకర్,దేవరకొండ మండల న్యాయ సేవాధి కార సంస్థ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్ తదితరులు ఉన్నారు. తొలుత జిల్లా లోని చింత మండలం సాయి సన్నిధి ని సందర్శించారు. గోశాలలో గో పూజ నిర్వహించారు.సాయి సన్నిధి లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.తర్వాత దేవరకొండ మున్సిఫ్ కోర్ట్ ను సందర్శించారు.న్యాయ సదస్సు తర్వాత జిల్లా కోర్ట్ నల్గొండ లో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking