అక్షిత అక్షరం… ప్రజాయుధం

అక్షిత అక్షరం… ప్రజాయుధం
అక్షిత డైరీ ఆవిష్కరణ

అల్లం నారాయణ 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

అక్షిత అక్షరం… ప్రజాయుధంగా పరిడవిల్లుతుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. సోమవారం మీడియా అకాడమీలో అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగితో కలిసి అక్షిత 2023 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన స్రవంతిగావెలుగొందుతున్న పత్రికల్లో జర్నలిజం రంగంలో మూడు దశాబ్దాలుగా విశిష్ఠ సేవలందించిన అనుభవం కల్గి ఉండి అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక, అక్షిత టివిలను స్థాపించి ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా విశిష్ఠ సేవలందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తోందన్నారు. అక్షిత అక్షరం… ప్రజాయుధంగా పరిడ విల్లుతుందన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ అక్షిత అక్షర శంఖారావం మోగిస్తూ ప్రజా సమస్యల సాధనకు కృషి చేస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ల సారధ్యంలో పత్రిక ఎన్నో సామాజిక అంశాలకు తోడుగా మానవీయ, పరిశోధనాత్మక కథనాలను వెలుగులోకి తెస్తూ పరిష్కారానికి చొరవ చూపుతుందని ఆయన తెలిపారు. మరింత నిత్య నూతనత్వంతో మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. దశాబ్దంన్నర కాలంగా అక్షిత అక్షర సమరం సాగిస్తుందని, అక్షిత దిన దిన ప్రవర్ధ మానంగా అక్షిత అక్షరం ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా వెలుగొందుతుందన్నారు. పత్రికలు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజాభీష్టానికి అనుగుణంగా వార్తలు రాసినప్పుడు మంచి ఆదరణ లభిస్తుందని ఆయన చెప్పారు. నిష్పక్షపాత వార్తలను రాస్తూ సమాజాన్ని మేల్కొల్పేందుకు కృషి చేయాలని కోరారు. నిజాలను నిర్భయంగా సమాజం ముందు ఉంచుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తున్నటువంటి అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక లాంటి పత్రికలు సమాజం మేలుకొలుపు కోసం పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పత్రికల సంఘం నేతలు మహేష్, బాలకృష్ణ, వెంకటయ్య, శ్రీనివాస్, అహమ్మద్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking