పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు చేయూత

*ఎం ఎల్ ఎ చేతులమీదుగా కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ*

చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి : పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు చేయూత నిస్తూ సీఎం కేసిఆర్ మేనమామగా అండగా నిలుస్తున్నారని మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజులు అన్నారు.సోమవారం చౌటుప్పల పట్టణ కేంద్రంలో జయ శ్రీ గార్డెన్లో కళ్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ పథకము చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు ఆసరాగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి,ఎం ఆర్ ఓ విజయ సింహా రెడ్డి, సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ బాబా షరీఫ్, కొరగోని లింగస్వామి, ఆలె నాగరాజు, కొయ్యడ సైదులు, పొలోజు శ్రీధర్ బాబు, సుల్తాన్ రాజు, కామిశెట్టి శైలజ, మరియు అధికారులు వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking