ప్రీతీ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

ప్రీతీ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

-బహుజన జేఎసి స్టేట్ చైర్మన్ బత్తుల శ్రీనివాస్ యాదవ్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ప్రీతీ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బహుజన జేఎసి స్టేట్ చైర్మన్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.నిన్న రాత్రి కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించా ప్రీతీ ఆత్మ శాంతించాలని అన్నారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కాలేజీలోని మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతి ర్యాగింగ్ తో బలికావటం విచారకరమన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడపిల్లలకు రక్షణ కరువైందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మా గిరిజన ఆడపడుచులకు బహుజన ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి ఇప్పుడు ఈ దారుణానికి ఒడిగట్టిన సైఫ్ ని కఠినంగా శిక్షించాలి వారి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ దేశమైన సంపత్ కుమార్ జిల్లా కన్వీనర్ దుంపటి సందీప్ బహుజన నాయకులు వేల్పుల రమేష్ టిల్లు వంశీ సాయి అఖిల్ దివ్య అనుష లక్ష్మీ ప్రసన్న మాధవి నాగమణి ప్రియాంక నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking