సృజనాత్మక శక్తిని వెలికి తీయాలి

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు

గజ్జల యోగానంద్

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తి పెరుగుతుందని శేర్లింగంపల్లి బిజెపి ఇన్చార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద పేర్కొన్నారు. స్థానిక పాపిరెడ్డి నగర్ డివిజన్ లోని రాజధాని హైస్కూల్లో నేషనల్ మేగా ఆర్ట్స్ మరియు సైన్స్ పేర్ పెష్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గజ్జల యోగానంద్ పాల్గొని విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ, విద్యార్థులు అద్భుతమైన వైజ్ఞానిక ప్రదర్శనలు చేశారని, వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పెరుగుతుందని, అలాగే వైజ్ఞానిక ప్రధశనల వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. సంవత్సరంలో ఒక్క రోజే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒక్క సారైనా విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేలా విద్యా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తద్ద్వరా పిల్లకు అత్యధిక జ్ఞానం సంపాదించు కునే అవకాశం ఉంటుంది అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నరేంద్ర గుప్త, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు అర్చనపల్లి సూర్య రావు, కో ఆర్డినేటర్ కార్తిక్, ప్రధాన కార్యదర్శి గంగుల రాజ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఇంద్రా కుమార్ రెడ్డి, విశ్వకర్మ సంగం రాష్ట్ర కో కన్వీనర్ గోవర్ధన్ ఆచారి, రాష్ట్ర, జిల్లా వివిద మోర్చల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking