క్రేజీ కిడ్జ్ ఆధ్వర్యంలో సైన్స్ ప్రయోగాల ప్రదర్శన

క్రేజీ కిడ్జ్ ఆధ్వర్యంలో సైన్స్

 ప్రయోగాల ప్రదర్శన

-ప్రముఖ సైన్స్ ఉపాధ్యాయడు

ప్రయోగాల శర్మ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరంలో కమాన్ బజార్ క్రేజీ కిడ్జ్ పిల్లల ఆటల లోకంలో ఖమ్మం మెజీషియన్ కేవి చారి పర్యవేక్షణలో వివిధ సైన్స్ ప్రయోగాల అవార్డు గ్రహీత ప్రముఖ సైన్స్ ఉపాధ్యాయు లు కె.వి.కె. శర్మ అలియాస్ ( ప్రయోగాల శర్మ ) ప్రయోగాత్మక అంశాలు వాటి ప్రయోజనాలని ప్రత్యక్షంగా పిల్లలు చూసి నేర్చుకునే విధంగా వాటి ప్రయోజనాలు అర్ధమయ్యే విధంగా చూపించారు. పిల్లలకు చదువుతోపాటు ఆటలు పాటలు భౌతిక రసాయన జీవశాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.క్రేజీకిడ్జ్ ఆటల నెలవు ఎందరో చిన్నారులకు వీలు కలిగిన సమయాల్లో ఆటలు ఆడే వినోదాన్ని అందించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా క్రేజీకిడ్జ్ మరో అడుగు ముందుకు వేస్తూ పిల్లలలో ఉన్న క్రియేటివిటిని వెలికి తీయాలనే సంకల్పంతో ప్రతి నెల ఒక అంశం మీద వివరణాత్మకంగా నిర్వహించాలని ప్రతిపాదన రూపొందించమన్నారు.అందుకై మా క్రేజీకిడ్జ్ ప్రాంగణంలో పిల్లలకు పూర్తి రక్షణ వలయంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో క్రేజీ కిడ్జ్ వ్యవస్థపకులైనటువంటి బండారు లావణ్య ఉపేందర్ ప్రముఖ న్యాయవాది వంగాకుల లక్ష్మయ్య విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking