మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

-మహిళలకు పెద్ద పీట వేస్తున్న బీఆర్ ఎస్ ప్రభుత్వం

-ఖమ్మం మేయర్ మేయర్ పునుకొల్లు నీరజ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ డిప్యూటి మేయర్ ఫాతిమా జోహార ఖమ్మం మార్కెట్ చైర్మన్ దోరేపల్లి శ్వేత అన్నారు. బుధవారం ఖమ్మంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో రూలింగ్ వన్ టివి న్యూస్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక కార్యక్రమంలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మహిళలకు రాజకీయ సామాజిక ఆర్థిక విభాగాలలో పెద్దపీట వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారన్నారు. ప్రస్తుతం సమాజంలో పోటీ ప్రపంచంలో పురుష పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు.మహిళలు కృషి పట్టుదలతో అన్ని రంగాల్లో రాణిస్తూ తమ సమాజాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారని తెలిపారు.ఖమ్మం జిల్లాకు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణి రైఫిల్ షూటర్ మారియా పూనా లో శిక్షణలో ఉన్న కూడా పుట్టినగడ్డ ఖమ్మంపై ఉన్న మక్కువతో ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషదాయకమని వారన్నారు.సినీరంగంలో ఖమ్మం బిడ్డ వశిష్ఠ చౌదరీ తన నటనతో అగ్రశ్రేణిలో రాణిస్తూ ఖమ్మం కు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నారని గర్వించదగిన అంశమని వారన్నారు.సన్మాన గ్రహీతలకు వారు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమ నిర్వాహకులను చానల్ సిఈవో షేక్ జానీపాషా ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం సిటి సెంట్రల్ లైబ్రరీ చైర్మెన్ మహమ్మద్ ఆశ్రిఫ్ మైనార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మహ్మద్ తాజుద్దీన్
మైనార్టీ నగర శంశుద్దీన్ డాక్టర్ స్వప్న డాక్టర్ ప్రేమలత నాట్య మయూరి ఏలూరి మీనా కట్స్ అండ్ కార్ల్స్ రేవతి సింధు షిఫా బ్యూటీ సంస్థ అధినాయకురాలు బ్యూటిషియన్ కాజోల్ జర్నలిస్టులు రోజా ఈశ్వరి రేష్మా నవాజ్ డ్రైవింగ్ స్కూల్ అధినాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking