అంబరాన్ని తాకేలా…కవిత పుట్టినరోజు వేడుకలు

మిర్యాలగూడలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు
* ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన యువనేత నల్లమోతు సిద్దార్ధ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకల్లో యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మహిళా నేతలు, తెలంగాణ జాగృతి సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.

ఎమ్మెల్సీ కవిత నిండు నూరేండ్లు సుఖసంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో విజయపథంలో ముందుకు సాగాలని నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పెండ్యాల పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు,పట్టణ కౌన్సిలర్లు మొహమ్మద్ ఇలియాస్, బంటు రమేశ్, ఐల వెంకన్న, సాదినేని శ్రీనివాస్, భీమ్లా నాయక్, తిరుమలగిరి వజ్రం, బాల శ్రీనివాస్ నాయుడు, రాంసింగ్, సర్పంచ్ బానావత్ లలిత సక్రు, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోదాటి రమ, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ యువజన ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, షోయబ్, హనుమాన్ సింగ్, నాగరాజు, బైరం గోపి, ఫయాజ్, కుమ్మరికుంట్ల సుధాకర్, నల్లగంతుల నాగభూషణం, నీరుకంటి శ్రీనివాస్ నాయడు, దత్తు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking