ఉత్తమ ప్రతిభతోనే ఉజ్వల భవిష్యత్తు

 

ఉత్తమ ప్రతిభతోనే
ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులే…ఉపాధ్యాయులై

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని, విద్యార్దులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ప్రధానోపాధ్యాయులు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలం అన్నారం ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు జరిగాయి.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాల్య దశ నుంచే ఓ గురి కల్గి విద్యనభ్యసించిన విద్యార్ధిని, విద్యార్దులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. విద్యార్థి దశలోనే ఉపాధ్యాయుల పాత్రను పోషిస్తే ఉపాధ్యాయ వృత్తి మెళుకువలు అవగత మవుతాయన్నారు. చక్కటి వేషధారణతో ఉపాధ్యాయుల పాత్రను పోషించి విద్యార్థులను ఆకట్టుకున్నారని ఆయన చెప్పారు.

విద్యార్థులు లయబద్దంగా వేసిన కోలాటం నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సాంస్కృతిక కార్యకమాలు జరిగాయి. జయంత్ ఏకపాత్రాభినయం విశేషంగా ఆకట్టుకుంది. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ జరిగింది.డిఈఓగా పగిళ్ల జయంత్, ప్రధానోపాధ్యాయులుగా సురేష్, ఉపాధ్యాయులుగా వర్షిత, వినీల, సంధ్యారాణి, అమృత, దీక్షిత, రితిక, పరశురాం, సాత్విక్, జోశ్య, లోకేష్, భరత్, నాగచైతన్య, మల్లీశ్వరి, చరణ్, మధు తదితరులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దీరావత్ శైలజ, ధనావత్ సుశీల, ఎస్ ఎమ్ సీ ఛైర్మెన్ బచ్చలకురి గురువయ్య, స్వీపర్ కృష్ణకుమారి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking