ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ క్రిష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 32 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ భాస్కర్ రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజల అర్జీలలో భు సమస్యలు, భూమి సర్వేకు, పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ల కోసం అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.