చండీగఢ్ లో
ఐజేయూ సమావేశాలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
మార్చి 18, 19 తేదీలలో రెండు రోజుల పాటు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశాలు చండీగఢ్ లో జరగనున్నట్టు ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 24 రాష్ట్రాల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆయా రాష్ట్రాల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యే ఈ సమావేశాలలో మీడియా సమస్యలు, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం, సామాజిక మాధ్యమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తల పెట్టిన చట్టంలోని నిబంధనల సవరణ, లేబర్ కోడ్ పేరుతో పత్రికా పరిశ్రమలో వేతన సవరణకు ఎగనామం పెట్టడం, మీడియాపై సమాజంలో సన్నగిల్లుతున్న విశ్వాసం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. చెన్నైలో జరిగిన పదవ ప్లీనరీ సమావేశ తీర్మానాల అమలుకు కార్యచరణ రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే 23వ తేదీన దేశ వ్యాప్తంగా తలపెట్టిన ‘సేవ్ జర్నలిజం’ పిలుపును జయప్రదం చేసేందుకు ఐజేయూ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజుల సమవేశాలకు అతిథులుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్, శాసనసభ స్పీకర్కుల్తర్ సింగ్ సంధ్వాన్, ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరవుతున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.