మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్ పెక్టర్ గా నర్సింహారావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ టూ టౌన్ పోలీసు ఇన్స్ పక్టర్ గా ఎ.నర్సింహారావు రానున్నారు. నాగర్ కర్నూల్ డఇసఇఆర్బఇ లో పని చేస్తున్న ఆయనను ఈ నెల 17న హైద్రాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఈ మేరకు బదిలీ ఆదేశాలు జారీ చేశారు. నర్సింహారావు ను రిలీవ్ చేయాలని నల్లగొండ జిల్లా పోలీసు ఎస్పి కె.అపూర్వారావు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీకి లేఖ పంపారు. మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ గా పని చేసిన ఎన్.సురేష్ 10 రోజులు క్రితం హైద్రాబాద్ కు బదిలీ అయ్యారు.