మహనీయుల చరిత్రను భావితరాలకు ఉపయుక్తం

*సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313 వర్ధంతి 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
మహనీయుల చరిత్రను భావితరాలకు అందజేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని జిల్లా బి.సి. సంక్షేమ అధికారిణి పుష్ప లత అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా బి.సి.సంక్షేమ అధికారి కార్యాలయం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి జిల్లా బి.సి.సంక్షేమ అధికారిణి పుష్పలత,గౌడ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313వ వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు స్మరించు కుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నకిరేకంటి కాశయ్య గౌడ్,అఖిలభారతం గౌడ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు చెరుకు మల్లికార్జున గౌడ్,బి.సి. ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొన్నె శంకర్ గౌడ్,యోగ మాస్టర్ యం.శంకరయ్య, గౌడ ప్రతినిధులు రాజా గౌడ్, లాలా గౌడ్,సత్య నారాయణ గౌడ్,గోవర్దన్ గౌడ్,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking