బహుజన చక్రవర్తి… పాపన్న గౌడ్

*బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్*….

*ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి*

చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :

రాచరికపు వ్యవస్థ నీడలో జమీందారులు జాకిర్దారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు దళిత బహు జనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చు అని నిరూపించిన సామాన్యుడు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.చౌటుప్పల మండల కేంద్రంలోని తంగేడపల్లి రోడ్డులో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా ఆదివారం నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలను ఏకంచేసి తనకున్న కొద్దిపాటి సైన్యంతో, ఆయుధ సంపత్తితో గోల్కొండ కోటతో పాటు తెలంగాణ ప్రాంతంలోని 32 కోటలను జయించి,బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం. మనందరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాసరెడ్డి, బోడిగే బాలకృష్ణ గౌడ్, వీరమల్ల వెంకటేశం గౌడ్, సత్యనారాయణ గౌడ్, పాశం సంజయ్ బాబు, నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking