*పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో పరీక్ష కిట్ల పంపిణీ*
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లను అందజేశారు. పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గోశిక బాల నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అక్షర శిల్పి, సాహితీవేత్త, ప్రభుత్వ వైద్యాధికారి బడుగు శ్రీరాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కుల సంపాదించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అలాగే పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ భక్తి మార్కండేయ స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు గోశిక నరసింహ, భావన రుషి కళానికేతన్ ఉపాధ్యక్షులు బడుగు బాలరాజు, పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు గోశిక శ్రీకాంత్, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.