ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎం.విఠల్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనడం తో చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు టైల్స్ శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, ఏనుగుల రాజిరెడ్డి శ్రీధర్, బాలు యాదవ్, పరమేష్ గౌడ్, మహిళలు సౌజన్య ,లావణ్య, రామ్ రెడ్డి, సోపాన్ రావు, సతీష్,రము, జోగారావు,తదితరులు పాల్గొన్నారు.