అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి

అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి. గొట్టిముక్కల వెంగళరావు

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
హనుమాన్ జయంతి పురస్కరించుకుని, బాలానగర్ డివిజన్ చిత్తరమ్మనగర్ డబుల్ బెడ్ రూమ్ సైట్ నందు శ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంగల్ రావు, ఏ. బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి. అనంతరం మాజీ కార్పొరేటర్ వెంగళరావును శాలువతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ప్రతి ఒక్కరు భక్తి భావంతో, ఆలయ ప్రాంగణం కాషాయంతో, జైశ్రీరామ్ నినాదంతో మర్మోగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్, బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్,డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారి ప్రవీణ్ గౌడ్, ఏ.శ్రీనివాస్ గౌడ్,మైసూర్ రవి,చిన్న శ్రీను,కిరణ్,శ్రవణ్, సిహెచ్. సాయి,శేఖర్,ముక్తర్ అహ్మద్,గురు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking