*పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ
నార్కట్ పల్లి మండలం,నల్గొండ మండలoలలో విస్తృత పర్యటన
పదవ తరగతి పరీక్షా కేంద్రాలు, కంటి వెలుగు శిబిరం,నర్సరీ ల తనిఖీ
కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి
నార్కట్ పల్లి, అక్షిత న్యూస్ :
జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి గురువారం నార్కట్ పల్లి, నల్గొండ మండలంలలో విస్తృతంగా పర్యటించారు. నార్కట్ పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్.పి.అర్.హై స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్ కాపింగ్ జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి జిరాక్స్ సెంటర్ లను మూసి వేయడం జరిగిందని పోలీసు సిబ్బందితో నిరంతరం భద్రత కల్పిస్తున్నామని పరీక్ష విధులలో పాల్గొనే సిబ్బందినీ సైతం అప్రమత్తం చేయడం జరుగుతుందని, ఇతరులను ఎవరిని పరీక్షా కేంద్రాల వద్దకు ఎట్టి పరిస్థితిలో అనుమతించడం లేదన్నారు.

ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేయడం జరుగుతుందని ఎం.పి.డి. ఓ లు,తహశీల్దార్ లు,అధికారులతో ప్రత్యేకంగా పరీక్ష సెంటర్ల తనిఖీలు చేయించడం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని అన్నారు.
*కంటి వెలుగు శిబిరం, నర్సరీ తనిఖీ*
18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించి శిబిరాలకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు. గురువారం నార్కట్ పల్లి చౌఢం పల్లి గ్రామం లో కంటి వెలుగు శిబిరాన్ని తనిఖీ చేశారు. కంటి వెలుగు పరీక్షల కోసం శిబిరాలకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని అన్నారు. ప్రతి రోజూ ఎంత మంది శిబిరాలకు వస్తున్నారు. ఎంత మంది కి పరీక్షలు నిర్వహిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందున కంటి సమస్యలతో బాధపడుతున్న ఉన్న వారందరు ఇట్టి శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. జూన్ 15 వరకు కొనసాగు కంటి వెలుగు శిబిరాలకు అత్యధిక సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేలా గ్రామాలలో అవగాహన కలిగించి, ప్రతి రోజు కనీసం 150 మందికి పైగా స్క్రీనింగ్ చేసేలా ఆశా కార్యకర్తలు, ఏ.యెన్.ఏం. లు, మహిళా సంఘ సంఘ సభ్యులు కృషి చేయాలన్నారు.
అనంతరం గ్రామం లో నర్సరీ తనిఖీ చేశారు.నర్సరీ లో మొక్కల ను పరిశీలించి మొక్కల కు బోర్డ్ లు ఏర్పాటు చేయాలని,మొక్కల జర్మినేషన్ పరిశీలించి హరిత హరం నాటికి మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు.అనంతరం నల్గొండ మండలం అనె పర్తి గ్రామం లో నర్సరీ తనిఖీ చేశారు.నర్సరీ ప్రవేశం వద్ద అర్చి ఏర్పాటు చేయాలని,మొక్కల గ్యాప్ లు లేకుండా చూడాలని అన్నారు.పక్కన వున్న వైకుంఠ ధామం ను తనిఖీ చేసి అర్చ్ ఏర్పాటు చేయాలని,ఎంతో ఖర్చు పెట్టే ప్రజల సౌకర్యార్థం నిర్మించిన వైకుంఠ ధామం ను వినియోగం లోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట నార్కట్ పల్లి ఎం.పి.డి. ఓ యాధగిరి,నల్గొండ ఎం.పి.డి. ఓ శ్రీనివాస్ రెడ్డి,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.