ప్రపంచ దేశాలు ఆరాధించే గొప్ప రోజు గుడ్ ఫ్రైడే

గుడ్ ఫ్రైడే సందేశంలో పాస్టర్ డేవిడ్

మద్దూరు, అక్షిత న్యూస్:

యేసు క్రీస్తు పాపుల కోసం మరణించిన గొప్ప రోజు గుడ్ ఫ్రైడే ను మండలంలోని మద్దూరు, లద్నుర్, సాలకాపూర్, మరుమముల, రెబర్థి, అర్జున్ పట్ల, లక్కపల్లి, వల్లంపట్ల, వంగపల్లి, గాగిళ్ళపూర్, దూలిమిట్ట, బెక్కల్, కొండాపూర్, గ్రామాల్లోని చర్చిలలో క్రైస్తవ సోదరి, సోదరులు ఉదయం నుండే ఉపవాసంతో ఆలయాల్లో ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. అదే విధంగా యేసు సిలువలో మరణించే చివరి నిమిషంలో 7మాటలను మండలంలోని లద్నుర్ గ్రామ బెతనియ చర్చి మెంబెర్స్ మొదటి మాట ఇలిటం రాజు, 2వ మాట పాకాల జయ, 3వ మాట జిడికంటి అనిత, 4వ మాట జీడికంటి రాజుకుమార్, 5వ మాట మళ్ళారపు కృప, 6వ మాట మల్లరపు అశోక్, 7వ మాట జీడికంటి సుదర్శన్ లు వివరించారు. ఆనంతరం పాస్టర్ ఇచ్చిన దైవ సందేశం తర్వాత నిమ్మరసంతో ఉపవాసం ప్రార్ధనలు ముగించారు.ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల పాస్టర్లు, సంఘాల నాయకులు, సంగస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking