ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ,వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.
ఎస్పీ మాట్లాడుతూ… గత సంవత్సరం ఈ ఫైరింగ్ రేంజ్ పనులు ప్రారంభించబడి, ఇపుడు పూర్తి అయ్యాయని, త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు,సిబ్బంది, మంచిర్యాల జిల్లా లోని బెల్లంపల్లి ఫైరింగ్ రేంజ్ కి వెళ్లి ఫైరింగ్ నిర్వహించేవారు. ఇది దృష్టిలో వుంచుకోని మన ఆసిఫాబాద్ జిల్లా పోలీసులకు ప్రత్యెేకంగా ఫైరింగ్ రేంజ్ ఎర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇందుకోసం ఇంథాని గ్రామ శివారులో పోలీస్ శాఖకు చెందిన భూమిలో కొత్తగా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే ఈ ఫైరింగ్ రేంజ్ ప్రారంభం ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ ఫైరింగ్ రేంజ్ నిర్మాణంలో శ్రమించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఎస్పీ నీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర రావు, ఆసిఫాబాద్ డిఎస్పీ శ్రీనివాస్, వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్సై సాగర్ మరియు తదితరులు పాల్గొన్నారు.