సంక్షేమంలో మనమే టాప్

సంక్షేమంలో మనమే నెం.1

* ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం
* ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’

మండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రమే దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందని, దేశానికే దిక్సూచిగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలతో పాటుగా కేంద్రం కూడా అనుకరిస్తోందన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన 31 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.14లక్షల 54 వేలు విలువైన చెక్కులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

 

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని కొనియాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, పట్టణ యువజన అధ్యక్షులు షేక్ జావీద్, బంటు రమేశ్, మలగం రమేశ్, వంగాల నిరంజన్ రెడ్డి, అమృతం సత్యం, పునాటి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యూసుఫ్, హాతీరాం, ఫహీముద్దీన్, బీఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు షెహనాజ్ బేగం, కుప్పాల సుబ్బారావు, తిరుమలగిరి వజ్రం, పశ్య శ్రీనివాస్ రెడ్డి, ఖాదర్, బొడ్డు నందకిషోర్ యాదవ్, చాంద్ పాషా, వడ్డేపల్లి శ్రీనివాస్, దారగాని వెంకటేశ్వర్లు, కందుల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking