ఘనంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు

  • పరిశుద్ధ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే
  • మహిళా కార్మికులకు చీరలు, పండ్లు పంపిణీ
  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబిత రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు
  • భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు అభిమానులు
  • గిరిజన ముత్యాలతో క్యాంపు కార్యాలయంలో కోలాహలం

రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో మంగళవారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అభిమానులు అధికారులు, ఎం కె ఆర్ ఫౌండేషన్ అభ్యర్థులు భారీగా తరలిరాడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కోసి ఎమ్మెల్యే వారికి తినిపించారు. అనంతరం ఇబ్రహీంపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మహిళా పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు, పండ్లు పంపిణీ చేశారు. స్వచ్ఛత కోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం పట్ల ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. కార్మికులు ఎమ్మెల్యేకు కేకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నరాల వ్యాధితో బాధపడుతూ కదలని నీ స్థితిలో ఉన్న చాణక్య అనే విద్యార్థి ఎమ్మెల్యే పై అభిమానంతో తాను స్వయంగా గీసిన ఎమ్మెల్యే చిత్రపటం పెయింటింగ్ ను ఎమ్మెల్యేకు అందజేశారు. ఆ విద్యార్థికి అన్ని విధాలుగా అండగా నిలబడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గిరిజన నృత్యాలు యువత కేరింతలతో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు హట్టహాసంగా జరిగాయి. ఉదయం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా రెడ్డి, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంచిరెడ్డి కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి ,ఆర్డీవో వెంకటాచారి, ఎసిపి ఉమామహేశ్వరరావు, సురేష్ చంద్రారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, చైర్మన్లు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking