కార్యకర్తలకు అండగా, ఆసరాగా బి.ఆర్.ఎస్ పార్టి -బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో: ఆదిలాబాద్ జిల్లా లోని బోథ్ నియోజకవర్గం లోని కార్యకర్తలకు అండగా, ఆసరాగా బి.ఆర్.ఎస్ పార్టి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బింపూర్;మండలములోని నిపాని గ్రామానికి చెందిన క్రీ,,శే,,లు భూమన్న దొర కుటుంబానికి పార్టి సభ్యత్వ ఇన్సూరెన్స్ కింద మంజూరు ఐన 2 లక్షల రూపాయల చెక్కును మంగళవారం రోజున బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అందించారు,గత కొన్ని నెలల క్రితం నిపాని సర్పంచ్,సీనియర్ నాయకులు భూమన్న దొర రోడ్డు ప్రమాదములో దురదృష్టవశాత్తు మృతి చెందిన విషయం విదితమే,పార్టి సభ్యత్వం కలిగి ఉన్న తనకు బి.ఆర్.ఎస్ పార్టి అండగా నిలిచి 2 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయగా అట్టి చెక్కును బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు స్వయంగా వారి ఇంటికి వెళ్లి చెక్కును అందించి వారికి భరోసానిచ్చి,మనోధైర్యాన్ని కల్పించారు,తను మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా,ఆసరాగా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం నిలబడుతందని,కార్యకర్తలే మా బలం,బలగమని అన్నారు,ఈ కేయక్రమములో మండల కన్వీనర్ నాగయ్య యాదవ్,వైస్ ఎంపీపీ గడ్డం లసమన్న,తాంసి ఎంపీపీ మంజల శ్రీధర్ రెడ్డి,ఆర్.బి.ఎస్ అధ్యక్షులు,కౌడాల మహేందర్,సంతోష్, అనిల్,గోవర్ధన్ యాదవ్,వెంకన్న, జాధవ్ గణేష్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking