మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలి బోయ రాములు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలి బోయ రాములు
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
రామన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మార్సీ వద్ద ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి,సామాజిక తత్వవేత్త,మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చెసిన ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రాములు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు,బలహీన వర్గాలకు చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.అలాగే సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించి తన భార్య అయిన సావిత్రి బాయి పూలేకు విద్యను నేర్పి ఆమె ద్వారా మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసారని తెలిపారు,కావున అందరూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మండల ప్రధాన కార్యదర్శి జనపాల కిషన్,యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిలువేరు అనిల్ కుమార్ తదితరులు పాల్గొ