*సీఎం కేసీఆర్ మానస పథకం
కేజీ టు పీజీ తూర్పులో తొలి అడుగు ఫలించిన ఎమ్మెల్యే నరేందర్ కృషి*
వరంగల్ :అక్షిత బ్యూరో : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిరకాల మానస పథకం కేజీ టు పీజీ విద్యకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తొలి అడుగు పడింది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నిరంతర కృషితో స్థలం కేటాయింపు విషయమై అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో శంభునిపేట ఉన్నత పాఠశాలతో పాటు ఉర్దూ మీడియం స్కూల్ కు 6236.21 గజాలు, రంగశాయిపేట జూనియర్ కళాశాలకు 3404 గజాల స్థలం ఇప్పటికే కేటాయించారు. తాజాగా వెలువడిన ఉత్తర్వుల మేరకు డిగ్రీ కళాశాల కోసం 3553.28 గజాలు కేటాయింపు జరిగింది. దీంతో మొత్తం ఒకే ప్రాంగణంలో ఇటు ప్రాథమిక, ఉన్నత, జూనియర్, డిగ్రీ కళాశాలలకు మొత్తంగా సొంత స్థలాలు ఏర్పాటయ్యాయి. అలాగే జూనియర్, డిగ్రీ కళాశాల కామన్ క్రీడా మైదానం కోసం 5573.01 గజాలు కేటాయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనాలను యధావిధిగా కొనసాగిస్తూ డిగ్రీ కళాశాల కోసం కొత్త భవనాన్ని నిర్మించనున్నారు.
ఎమ్మెల్యే కృషి ఇలా కొనసాగింది..
సువిశాలంగా ఉన్న శంభునిపేట హైస్కూల్ ప్రాంగణంలో కొనసాగుతున్న జూనియర్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు కోసం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ విషయంలో ఖిలా వరంగల్ సింగిల్ విండో చైర్మన్ కేడల జనార్ధన్ తగు నిర్వహణ కోసం ముందుకు కదిలారు. అలాగే విద్యాశాఖకు సంబంధించి అధికారులు కూడా సహాయ సహకారాలు అందించారు. పలుమార్లు ఎమ్మెల్యే ఈ విషయమై హైదరాబాద్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ను స్వయంగా కలుసుకొని వినతిపత్రాలను అందించడంతో పాటు ఇందుకు సంబంధించిన కార్యాచరణతో అధికారులు పనిచేయగా గట్టి ప్రయత్నాలు చేశారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల్లో కదలిక ఏర్పడింది. ముగ్గురు ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పడింది. రెండు శాఖలకు ఉన్నతాధికారిగా ఉన్న ఐఏఎస్ నవీన్ మిట్టల్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా ఉన్న దేవసేనలతో ఏర్పడిన కమిటీ జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మొత్తం విస్తీర్ణం, ఇప్పటికే కొనసాగుతున్న విద్యాసంస్థలు, వాటి పరిధిలోకి వచ్చే స్థలం, తదితర వాటిని కూలంకశంగా అధ్యయనం చేసిన అనంతరం డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు కోసం నిర్ణయం తీసుకున్నారు. ఆ తదుపరి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. తమ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు విషయంలో కృషి చేసిన నరేందర్ కు ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఖిలా వరంగల్ సింగిల్ విండో చైర్మన్ కేడల జనార్ధన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బందితో కలిసి ప్రిన్సిపల్ డాక్టర్ గుర్రపు శ్రీనివాస్ ఎమ్మెల్యేకు శాలువా కప్పి బొకేను అందజేశారు.స్థలం కేటాయింపు ఇలా.డిగ్రీ కళాశాలకు 3553.28 గజాలు
జూనియర్ కళాశాలకు 3404.50 క్రీడా మైదానానికి 5573.01 హైస్కూల్ కు 6236.21జీడబ్ల్యుఎంసీ వాటర్ ట్యాంక్ కోసం 2422.31 గేటు ఇవతల ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది
కేజీ టు పీజీకి తొలి అడుగు పడడంతో రైల్వే గేటు ఇవతల ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు కోసం నాలుగైదేళ్లుగా అలుపెరుగని కృషి చేశా. ఇటు స్థానిక అధికారులను సమన్వయపర్చుకొని, అటు హైదరాబాద్ లో ఉన్నతాధికారులను పలుమార్లు కలుసుకున్నాను. గత కలెక్టర్ అమ్ర పాలి ఉన్నప్పటి నుంచి నా ప్రయత్నాలు మొదలయ్యా యి. ఏదేమైనా అనుకున్నది సాధించాను. త్వరలోనే డిగ్రీ కళాశాలకు నిధుల కోసం కృషి చేస్తానని ఎమ్మేల్యే తెలిపారు కార్యక్రమం లో నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.