వడ్డేపల్లి రాకతో కూకట్పల్లి భాజపా శ్రేణుల్లో నూతన ఉత్సాహం… నియోజకవర్గంలో దూసుకుపోతున్న రాజేశ్వరరావు.

వడ్డేపల్లి రాకతో కూకట్పల్లి భాజపా శ్రేణుల్లో నూతన ఉత్సాహం…

నియోజకవర్గంలో దూసుకుపోతున్న రాజేశ్వరరావు.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వరరావు భాజపాలో చేరి కార్యక్రమాలు వినూత్నంగా చేసుకో పోతుండడంతో కూకట్పల్లి నియోజకవర్గం లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతూ వస్తున్నాయి. బిజెపి పంచుకోవడంతో కూకట్పల్లి నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఉన్న గులాబీ పార్టీ బలహీనంగా తయారవుతున్నట్లు కనిపిస్తోంది. బిజెపిలో చేరిన నాటి నుండే వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి ప్రాంతంలో హల్చల్ చేస్తూ అందర్నీ కలుపుకొని కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు. రాజకీయ పునాదులు, అర్థ బలం, అంగ బలం, కలిగిన వడ్డేపల్లి రాజేశ్వరరావు క్రియాశీల రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడంతోనే కూకట్పల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతువస్తున్నాయి. దివంగత నేత ఉమ్మడి జిల్లా రాష్ట్ర ఖనిజ అభివృద్ధ సంస్థ మాజీ చైర్మన్ వడ్డేపల్లి నర్సింగరావుకు నియోజకవర్గం తో విడదీయలేని అనుబంధం ఉందని చెప్పవచ్చు. రాజకీయంగా, సామాజిక ,సేవా కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలతో ఆయన మంచి అనుబంధం పెంచుకున్నారు. అంతేకాకుండా అన్ని వర్గాల వారితో మమేకమై గతంలో పనిచేశారు. ఆపదలో అపన్న హాస్తం అందించే ఉదారవాదిగా , మానవతాపాదిగా ,బోలా శంకరుడిగా వడ్డేపల్లికి నియోజకవర్గం లో మంచి పేరుంది. వడ్డేపల్లి అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ స్థాయిలో కూడా రాజకీయ, సామాజిక అవగాహన కలిగిన ప్రతి ఒక్కరికి అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వడ్డేపల్లి అంటే కూకట్పల్లి అని, కూకట్పల్లి పేరు చెప్తే టక్కున గుర్తొచ్చేది వడ్డేపల్లి అనడంలో అతిశక్తి లేదు. వైయస్ ప్రభుత్వంలో ఏపీ ఎండీ సీ చైర్మన్గా సేవలందించిన వడ్డేపల్లి 2009లో మొదటిసారిగా ఏర్పడ్డ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలబడి కొన్ని రాజకీయ కారణాలవల్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైనారు. కొంతమంది చేసిన మోసం వల్ల ఆయన ఓటమి చెందినా ఆయన పట్ల గాని ఆయన కుటుంబం పట్ల గాని ఆదరణ ఇప్పటికీ నియోజకవర్గ ప్రజల్లో తగ్గలేదని చెప్పవచ్చు.

సేవా కార్యక్రమంలో తండ్రిని మించిన తనయుడు…

వడ్డేపల్లి నర్సింగరావు ఏకైక వారసుడుగా వడ్డేపల్లి రాజేశ్వరరావుకు కూడా కూకట్పల్లి ప్రాంతంలోనే కాక పరిసర ప్రాంతాలలో కూడా మంచి పేరే ఉంది. గుణంలో గాని, నడవడిలో గాని, కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవాలనే విషయంలో గానీ తండ్రికి ఏమాత్రం తీసుపొరని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. ఎ లాంటి అహంకారం, గర్వం లేకుండా ఓ సామాన్య వ్యక్తిగా,అందరితో కలిసిపోయి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వడ్డేపల్లి అనే పేరుని మరింత ఇనుమడింప చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా గత ఐదు సంవత్సరాలుగా కూకట్పల్లి తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాసులకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ,సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వడ్డేపల్లి అనే పేరును కాపాడుతూ వస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థుల చదువులకు ఫీజులు చెల్లిస్తూ, అనారోగ్యాల కు గురై, ఆసుపత్రిలో చేరిన వారికి తానున్నానంటూ చేయితనందిస్తూ ముందుకు సాగుతున్నారు. దేవాలయాల నిర్మాణాలకు, సామూహికంగా వివిధ వర్గాలు జరుపుకునే పండుగలు, పబ్బాలకు అందించే సహకారంలో అయినది పెద్దాయనకు మించిన పెద్ద చెయ్యిని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఉమ్మడి రాష్ట్రంలో వడ్డేపల్లి నర్సింగరావు కున్న మంచి పేరు పలుకుబడి కారణంగా ప్రస్తుతం రాజేశ్వరరావు రాజకీయాలకతీతంగా అందిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా వడ్డేపల్లి రాజేశ్వరరావుకు తిరుమల తిరుపతి దేవస్థానం గత రెండు పర్యాయలుగా తెలంగాణ టిటిడి అడ్వైజరీ బోర్డు ఉపాధ్యక్షులుగా నియమించింది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. ఒకవైపు దైవ దర్శనం చేసుకోవాలనుకునే వేలాది మందికి సులువుగా దైవ దర్శనం కల్పిస్తూ, ఇంకోవైపు ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారు. ఎక్కడ చూసినా మళ్లీ వడ్డేపల్లి అనే పేరు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతు వస్తుంది. గతంలో ఒక దశాబ్దం పాటు దివంగత నేత వడ్డేపల్లి నర్సింగరావు చేసిన సేవా కార్యక్రమాల వల్ల వడ్డేపల్లి అనే పేరుకు ఎంతటి వైబ్రేషన్ ఉండేదో మళ్లీ పదేళ్ల తర్వాత కూకట్పల్లి నియోజకవర్గంలో అంతటి పాజిటివ్ వైబ్రేషన్స్ క నిపిస్తున్నాయి.

వడ్డేపల్లి రాకతో పుంజుకున్న బిజెపి

దివంగత నేత వడ్డేపల్లి ఆశయాలను నెరవేర్చడం, వడ్డేపల్లి అనే పేరుకు మరింత సార్ధకత చేకూర్చడానికి, ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి రాజకీయ వేదికలే సరైనవని భావించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో రాజకీయ రంగం ప్రవేశం చేశారు. చేరిన అనతి కాలంలోనే తనదైన నాయకత్వ లక్షణాలతో దూసుకెళ్తుండడం అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది. కూకట్పల్లి నియోజకవర్గం లో ఎన్నడూ పెద్దగా ప్రభావం చూపని బిజెపికి రాజేశ్వరరావు రాకతో కొత్త ఆశలు చిగురించాయి. గతంలో ఉన్న కొద్ది మంది నాయకులు కార్యకర్తలు కూడా గ్రూపులు, వర్గాలతో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఉన్న పరిస్థితి నుంచి ఒక తాటి మీదికి తెచ్చే ప్రయత్నాలను వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. కార్యకర్తలకు తానున్నానని ధైర్యాన్ని నూరిపోస్తూ పార్టీకి జవసత్వాలు కల్పించే పనిని భుజానికి ఎత్తుకున్నారు. పదవుల ముఖ్యం కాదని, పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఎవరికి అవకాశం వచ్చినా కలిసికట్టుగా కూకట్పల్లి నీ కైవసం చేసుకుందామంటూ పదవుల కోసం ఊహల పల్లకిలో ఉన్న నాయకులకు నచ్చచెప్పుతూ పార్టీలో వర్గాలకు తావు లేకుండా చేస్తూ తనదైననాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తువస్తున్నారు. కూకట్పల్లిలో బిజెపి అంటేనే గంజిలో ఈగ లా తీసేసే గులాబీ నాయకులకు వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రదర్శిస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలు, నాయకత్వ ప్రతిభ తో ఆ పార్టీలో వణుకు మొదలైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే వడ్డేపల్లి రాజేశ్వరరావు రాష్ట్ర పార్టీ గుర్తింపు ప్రశంసలను పొందగలడం ఇక్కడ గమనించ వచ్చు. రాష్ట్ర పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన ముందుగా కూకట్పల్లి నుంచి వడ్డేపల్లి రాజేశ్వరరావుకే సమాచారం అందిస్తుండడం, వివిధ బాధ్యతల అప్పగించడం ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకోవైపు పార్టీ సిద్ధాంతాలు , కార్యక్రమాలతో సంబంధం లేకుండా ముస్లిం క్రిస్టియన్, దళిత గిరిజన వర్గాల ప్రజలు వడ్డేపల్లి రాజేశ్వరరావు ను కలిసి వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతున్నారు. అవకాశం వస్తే కలిసి నడవడానికి సిద్ధమని చెబుతుండడం ప్రత్యర్థి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపు తుంది. ప్రస్తుతం కాంగ్రెస్, అధికార టిఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి లోలోపల నుంచిపెద్ద ఎత్తున మద్దతు పెరుగుతుంది. గతంలో వడ్డేపల్లి కుటుంబంతో ఉన్న అనుబంధం , రాజేశ్వరరావు మాట మర్యాద, నడవడిక,కలుపుగోలుతనం నచ్చి పార్టీలతో సంబంధం లేకుండా ముందుకు వస్తుండడం కూకట్పల్లిలో రాజకీయ సమీకరణలు వేగంగా మారే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గం అభిప్రాయపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking