ఘనంగా పాల్వాయి స్రవంతి అక్క జన్మదిన వేడుకలు
నాంపల్లి, అక్షిత న్యూస్:
మండలంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి జన్మదిన వేడుకలు నాంపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గఫార్ పాల్గొని వారు మాట్లాడుతూ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలుపెరుగని నాయకురాలు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ పార్టీ నిర్ణయాలను తన భుజాలపై వేసుకొని అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతూ పార్టీని కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నది స్రవంతి అక్కని ఆయన కొని ఆడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంగయ్య, మండల అధ్యక్షులు కొమ్ము బిక్షం, దామెర గ్రామ సర్పంచ్ దామెర యాదగిరి, పంగ దేవేందర్, కొండ్రెడ్డి వెంకటయ్య, వేలాద్రి, నాంపల్లి సంజీవ గడ్డం, అనిల్, కోనేటి సాయి, గాదపాక యాదయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.