15వ రోజు గడప గడపకు బీజేపీ ప్రజా యాత్ర చెరువులు, నాళాలు, కబ్జాల పై చర్యలు ఏవి .. బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

15వ రోజు గడప గడపకు బీజేపీ ప్రజా యాత్ర
చెరువులు, నాళాలు, కబ్జాల పై చర్యలు ఏవి
.. బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి:

శేరిలింగంపల్లి నియోజక వర్గ బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 15 రోజు గడప గడపకు ప్రజా యాత్ర లో భాగంగా మంగవారం నాడు అల్విన్ కాలనీడివిజన్ లో ని వివిధ బస్తీ, కాలనీ లకీ చేరుకుంది ఇల్లు కట్టాలన్న పింఛన్ అడగాలన్న రేషన్ కార్డు కావాలన్నా బిఆర్ఎస్ నాయకులకు లంచం ఇవ్వవలసిందే అని బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు
ఆల్విన్ కాలనీ డివిజన్ సాయి చరణ్ కాలనీ, ఇందిరానగర్, శంసిగూడ లలో రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ చేపట్టిన ప్రజా యాత్రలో భాగంగా గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రజల అనూహ్యమైన స్పందన పార్టీ కీ ఆధరణ అమోఘం అపూర్వం అని అన్నారు. అధికార పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాల తో విసిగి వేసారిన ప్రజలు వచ్చే ఎన్నికలలో కమలం పువ్వు కీ ఓటు వేసి చరిత్ర తిరగరాసే ఉత్సాహం లో ప్రజలు పార్టీ శ్రేణులు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్, నర్సింగ్ యాదవ్, నరసింహచారి, శ్రీధర్ చారి, ఆంజనేయులు, శ్రీనివాస్ పంతులు, సీతారామరాజు, మొదలవారి ఆధ్వర్యంలో పాదయాత్ర గడపగడపకు కొనసాగింది
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్లో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా కోర్లపరమై వర్షాకాలంలో పరిసర ప్రాంతాలు ముంపునకు గురైతున్నాయని తెలియజేస్తూ, మా పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు మేము గుర్తించి ఆందోళనలు చేపడిత తప్ప స్తానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు గుర్తు చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ విమర్శించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ,జిల్లా, మహిళా మోర్చా, యువ మోర్చా, వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking