టిఆర్ఎస్ కు తొలి విజయం సిద్దిపేట, బిఆర్ఎస్ కు తొలి విజయం మునుగోడు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
టిఆర్ఎస్ కు తొలి విజయం సిద్దిపేట, బిఆర్ఎస్ కు తొలి విజయం మునుగోడు
ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి:
చౌటుప్పల్ పట్టణంలోని ఎస్ఎంఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్, జెడ్ పి ఛైర్మెన్ సందీప్ రెడ్డి, దేవీ ప్రసాద్, బి ఆర్ఎస్ శ్రేణులు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…
టిఆర్ఎస్ కు తొలి విజయం సిద్దిపేట అయితే బిఆర్ఎస్ కు తొలివిజయం మునుగోడు అని, ఎంత డబ్బు ఆశ చూపినా, మునుగోడు అభివృద్ధి కోసం చూసారని, ఎన్నిసార్లు అభినందించినా తక్కువేనని మునుగోడు నియోజకవర్గ ప్రజలను కొనియాడారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు గా ఈ 100 పడకల ఆసుపత్రి వచ్చిందన్నారు.

నిజం కూడా ప్రచారంలో ఉండాలి, లేదంటే అబ్దద్దం ప్రచారం అవుతుందని రాష్ట్రాన్ని, దేశాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉందని అంబేడ్కర్ చెప్పారని తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ ఏ రాష్ట్రం అయినా తెలంగాణతో పోటీ పడగలదా,ఇక్కడున్న పథకాలు అక్కడ ఉన్నాయా..
వాళ్ళు ఇక్కడికి వచ్చి డబుల్ ఇంజిన్ అంటారు,డబుల్ ఇంజిన్ మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మన పథకాలు ఉన్నాయా..60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ఎందుకు రాలేదని దుయ్యబట్టారు.జానా రెడ్డి, ఆ బ్రదర్స్ ఇక్కడే ఉన్నారు ఎందుకు మెడికల్ కాలేజీలు, బత్తాయి మార్కెట్, నిమ్మకాయ మార్కెట్ రాలేదన్నారు.
పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో కూడా రాజకీయం చేసే పార్టీ బిజెపి అని,పొద్దున వాళ్ళే లీక్ చేశారు, మధ్యాహ్నం ధర్నా చేశారు, సాయంత్రం పేపర్ లీక్ కాలేదు ఎందుకు ధర్నా అన్నారని బిజెపి కుట్రలపై ద్వజమెత్తారు.
బిజెపి ఎన్ని ట్రిక్స్ చేసినా బి ఆర్ ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని తెలిపారు.బిజెపి పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్ అయితే మనది అగ్రి కల్చర్ అని అన్నారు.
2014-15లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి రూ.26,600 కోట్లకు చేరుకుందని తెలియజేశారు. మహిళలు ఎందుకు మీ ప్రభుత్వానికి ఓటు వేయాలని భట్టి విక్రమార్క అడిగారు,కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చారు, ఈ పథకం కింద 10.26 లక్షల మంది లబ్ది పొందారని. దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు.ఇప్పటి వరకు 13లక్షల మంది బాలింతలకు కేసీఆర్ కిట్లు అందించామని తెలిపారు.
నీళ్ళు మోసే భారం లేకుండా నల్లాలు పెట్టామని,వడ్డీ లేని రుణాలు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ ఇచ్చామని తెలిపారు.
అందుకే మహిళలు బి ఆర్ ఎస్ వైపే ఉంటున్నారని తెలిపారు.
కంటి వెలుగు ద్వారా దవాఖానలు మీ వద్దకు తెచ్చామని, నేను వడ్లు కొనా అని కేంద్రం అంటే, కేసీఆర్ ప్రతి గింజ కొంటున్నారని తెలియజేశారు.బి ఆర్ ఎస్ కార్యకర్త గొప్పగా చెప్పుకునే రోజు వచ్చిందని అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు తెలియజేశారు.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ తల రాత మారిందని,
రైతన్న సంతోషంగా ఉంటున్నాడంటే సీఎం కేసీఆర్ వల్లే అని,నాడు అన్నమే లేని జిల్లా..నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది అని కేసీఆర్ వల్లే సాద్యమైందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పథకాలు చేరువ అయ్యాయని,
తెలంగాణా సంక్షేమం, అభివృద్ధి యావత్ బారతనికి పాకిందని అన్నారు.గుజరాత్ తో సహా బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇక్కడి పథకాలకు డిమాండ్ పెరిగిందని,
ఆయా రాష్ట్రాల ప్రజలు తిరుగుబాటు కు సన్నద్ధమౌతున్నారని,
హస్తిన పీఠం కదులుతుందన్న బెంగ బిజెపి కి పట్టుకుందని అన్నారు.35 శాతానికి పై చిలుకు అర్థాకలితో అలమటిస్తున్నారని,
త్రాగునీరు కొనుక్కునే దుస్థితి గుజరాత్ ప్రజలదని,విద్యుత్ సరఫరా అక్కడ ఆరు గంటలే అని,
ఆసరా ఫించన్ అందేది 600 రూపాయలే అని, మోటర్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి బిల్లుల వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ మాకెందుకు ఇవ్వడం లేదన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైందని తెలిపారు.కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్, అమ్మవడి పథకాలు మాకెందుకు లేవు అన్న వాదన మొదలైందని అన్నారు.
దీనితో బిజెపి నేతల్లో కలవరం మొదలైందని, అందుకే ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు మోకాలొడ్డుతున్నారని తెలిపారు.
సంక్షేమ పథకాలకు అవరోధాలు సృష్టిస్తున్నారని,వీటన్నింటినీ అధిగమించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కుందని తెలియజేశారు.
బి ఆర్ యస్ ప్రభుత్వంలో లబ్ది పొందిన మొదటి జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అని,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా ఉంటుందని అన్నారు.12 కు 12 స్థానాలలో గులాబీ జెండాలు ఎగరడం పెద్ద రికార్డ్ అని,నెహ్రు పాలనలో స్వాతంత్రం తెచ్చిన పార్టీ కుడా ఇంతటి గౌరవం దక్కలేదని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చాకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 సాధించిన రికార్డ్ గులాబీ పార్టీదని సంతోషం వ్యక్తంచేశారు.
గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాకే సస్యశ్యామలం గా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లా,47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేశారని తెలిపారు.ఉచిత విద్యుత్ తో లబ్దిపొందింది ఉమ్మడి నల్లగొండ జిల్లా,అత్యధిక బోర్లతో డిలా పడిన రైతన్న కండ్లలో వెలుగులు నింపింది గులాబీ జెండా అని, అటువంటి గులాబీ జెండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో
భవిష్యత్ లో 12 స్థానాలలో గులాబీ జెండా యే ఎగురుతుందని తెలిపారు.
ఆత్మీయ సమ్మేళనాలు గులాబీ శ్రేణుల బాంధవ్యాలు పెంపొందిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో
జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.