మన ఊరు మన బడి పథక పనులు రాష్టానికే ఓక దిక్సూచి లా నిలపాలి. – జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్..
మన ఊరు మన బడి పథక పనులు రాష్టానికే ఓక దిక్సూచి లా నిలపాలి.
– జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్..
సిద్దిపేట అక్షిత ప్రతినిధి :
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో సిద్దిపేట నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద పనులు కేటాయుంచిన మండలాల వారీగా ఎంఈవో,ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, నిర్మాణ ఏజెన్సీలతో పాలనాధికారి సమీక్ష సమావే శం నిర్వహించారు. కార్యక్రమం లో పాలనాధికారి మాట్లాడు తూ…రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్వంత నియోజకవర్గం కావునా ఇక్కడ జరుగుతున్న మన ఊరు మన బడి పథకం పనులు రాష్ట్రానికే దిక్సూచిలా నిలిపేలా పనుల్లో వేగం పెంచి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మండలాల వారిగా పాఠశాలల జరుగుతున్న పనుల గూర్చి అధికారులను అడిగి తెలుసు కున్నారు.ఈ పథకంలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, మెజర్ మైనర్ పనులు, తాగునీటి వసతి పనులు దాదాపు పూర్తి కావచ్చాయని,ఈజీఎస్ కింద చేపట్టే పనులు మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ త్వరగా పూర్తి చేసి కలరింగ్ వేయడానికి నమోదు చేసుకోవాలి. తర్వాత ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు, డైనింగ్ హల్ ఇతరత్రా పనులు పూర్తి చేయాలి.అసిస్టెంట్ ఇంజనీర్లు ఇప్పటి వరకూ అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలి.ఎన్ఆర్ఈ జిఎస్, ఈజీఎస్ పనులు మరియు ఇతర పనులు త్వరగా పూర్తి చేసేలా పర్యవే క్షణ చెయ్యాలని ఎంపిడిఒ, ఎపిఓ లకి తెలిపారు.ఎంఈఓ లు రోజు వారిగా పాఠశాలలు తిరిగి అందరిని సమన్వయ పరచాలి.

పాఠశాలల్లో సేవింగ్స్ వస్తే సుందరీకరణ పనులు మెట్లకు గ్రానైట్, స్టేజి ఏర్పాటు, గ్రీన్ కార్పెట్, బెల్ మౌత్ గేట్ పైన ఆర్చ్, ఇలా అయా పనులు చేసుకోవాలి. తడకపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో వేగంగా పూర్తి చేయించాలని కాంట్రా క్టర్కు తెలిపి సుందరికరణ బాధ్యతలను అర్బన్ ఎంపీడీవో సమ్మిరెడ్డి బాధ్యత తీసుకోని పెద్ద స్కూల్,మైదానం ఉన్నం దున క్రీడలకు సంబంధించిన ప్రతిదీ డెవలప్ చేయాలని తెలియజేశారు.మిట్టపల్లి జిల్లా పరిషత్ పాఠశాల సుందరీ కర ణ బాధ్యత మండల ఎంఈఓ, నారాయణరావుపేట జిల్లా పరిషత్ పాఠశాల సుందరీకరణ బాధ్యత మండల ఎంపీఓ కి అప్పగించారు.నంగునూరు మండలంలో పాఠశాలలో పథక పనులు నత్తనడకన సాగుతు న్న పంచాయతీరాజ్ ఈఈ పర్యవేక్షణ చేసి పనులు వేగవంతం చేసేలా చర్యలు తిసుకోవాలన్నారు.పాఠశా లలో కిచెన్ షెడ్ లో బియ్యం బస్తాలను నిల్వ చేయడానికి లోపల ఓక మూలన 1ఫీట్ ఎత్తులో గద్దె మాదిరిగా నిర్మిం చాలన్నారు.మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
ఇట్టి సమావేశంలో డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, పంచాయ తీ రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.