భూసేకరణను త్వరగా పూర్తి చెయ్యాలి – జిల్లా పాల నాధికారి ప్రశాంత్ జే పాటిల్

భూసేకరణను త్వరగా పూర్తి చెయ్యాలి – జిల్లా పాల నాధికారి ప్రశాంత్ జే పాటిల్

సిద్దిపేట అక్షిత ప్రతినిధి :

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో అదనపు టిఎంసి పనుల గూర్చి భూసేకరణ చేయవలసిందిగా ఇరిగేషన్ అధికారులకు జిల్లా పాల నాధికారి ప్రశాంత్ జే పాటిల్ ఆదేశించారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావే శంలో పాలనాధికారి మాట్లాడు తూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకం గా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు మన కళ్ళ ముందే ప్రత్యక్షంగా చుస్తున్నాం.ఈ ప్రాజెక్టును మరింత అభివృద్ధి పరచడానికి మిడ్ మానేరు నుండి కొండపోచమ్మ రిజర్వా యర్ వరకూ డిపిఆర్ లో పెర్కోన్న విధంగా అదనపు టిఎంసి పనుల చేయడానికైనా భూసేకరణను త్వరగా పూర్తి చెయ్యాలని పాలనాధికారి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారు లకు తెలిపారు.జిల్లాలో అనంతగిరి రిజర్వాయర్, రంగనాయకసాగర్,మల్లన్నసా గర్, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్ట్ లను తక్కువ సమయంలో నింపి ప్రజలకు కావాల్సిన సాగు, తాగు నీటిని అందించేందుకు అదనపు టిఎంసి ని ఎంతగానో ఉపయో గపడుతుంది.జిల్లాలో భూసే కరణ సంబంధించిన పనులను అత్యంత పారదర్శకతతో ఏ ఓక్కరికి అన్యాయం జరగకుం డా నష్టపరిహారం అందించాల న్నారు. భూసేకరణను స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తిసుకోవాలన్నారు.ఈ కార్యక్ర మంలో ఆర్డిఓ అనంతరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఇ బస్వరాజ్, ఈఈ సాయిబాబ,ఎఈఈ కాజపాషా,డిఈ,ఎఈ తదితరు లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking