పట్టణంలో దుప్పి హల్చల్
మందమర్రి, అక్షిత ప్రతినిధి:-
అడవి నుండి దారితప్పి జనవాసాలుకు వచ్చిన దుప్పి పట్టణంలో మంగళవారం హల్చల్ సృష్టించింది. పట్టణంలో 1వ జోన్ లోని అర్బన్ సెంటర్ ప్రాంతంలో దుప్పి ని స్థానికులు గమనించారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పరిసర ప్రాంతాలను పరిశీలించి, ఒర్రెగడ్డ జెడ్పి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దుప్పిని కనుగొని, దానిని పట్టుకున్నారు. పట్టుకున్న దుప్పి మగ దుప్పి గా గుర్తించి, మంచిర్యాల అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.