ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందడంలేదు _చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశంపై సీఎం స్పందించాలి – సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందడంలేదు
_చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశంపై సీఎం స్పందించాలి
– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
చేర్యాల,ఏప్రిల్ 18 అక్షిత ప్రతినిధి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ నేత చాడ నేతృత్వంలో సాగుతున్న ప్రజా చైతన్య యాత్ర చేర్యాలకు మంగళవారం చేరుకోగా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అంగడి బజార్ వద్ద వారికి పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు.అక్కడి నుండి గాంధీ సెంటర్ వరకు సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం గాంధీ సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ బ్రిటిష్ వలస పాలనలో 1920 సంవత్సరంలో కార్మికులు స్థాపించినారని,గ్రామాల నుండి మొదలుకొని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సిపిఐ పార్టీ ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. చేర్యాల ప్రాంత ప్రజలు గత కొన్నాళ్లుగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని పోరాడుతున్నారని వారి చిరకాల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ప్రజా సమస్యలపై పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వంలో 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లు, లక్ష రూపాయల రుణ మాఫీ, రేషన్ కార్డులు, రైతులు ఇబ్బందులు పడుతున్న ధరణి పోర్టల్ సమస్యను సీఎం కెసిఆర్ ను చాలా మార్లు ప్రశ్నించామన్నారు. గ్రామస్థాయిలో సిపిఐని మరింత బలోపేతం చేసి ప్రజా పోరాటాల నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాండ్ర సదానందం,గడిపే మల్లేష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య, గూడెం లక్ష్మి, కిష్టాపురం లక్ష్మణ్, శంకర్, బాల్ మోహన్, శ్రీనివాస్, పద్మ, కుడిక్యాల పద్మ,మమత, బండారి సిద్ధులు,సదాశివ, సుదర్శన్, నరసింహాచారి,రామగళ్ళ నరేష్,లక్ష్మీనారాయణ,అంజయ్ మధు,మల్లమ్మ,బాబు, మురళి,కనకయ్య,సంపత్, మహేందర్,కనకయ్య, అంజనేయులు,సురేందర్, దుర్గయ్య,ఎల్లయ్య, సత్యనారాయణ,భద్రయ్య,శంకర్, కిష్టయ్య,రాజు,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.