ఐకెపి విఎఓల సమస్యలు పరిష్కరించాలి
*సిఐటియు నేత రామ్మూర్తి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఐకెపి విఎఓల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఐకెపి విఎఒలు రెండో మంగళవారం సమ్మె కొనసాగించారు. సెర్ఫ్ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి మాట్లాడుతూ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26,000లు ఇవ్వాలని,రూ.10లక్షలు సాధారణ భీమా, ఆరోగ్య భీమా కల్పించాలని, సెర్ఫ్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అర్హులైన విఎఓలను సిసిలుగా పదోన్నతి కల్పించాలని, నెలనెలా వేతనాలివ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మి, కె.చంద్రకళ, కోశాధికారి జాను, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, లక్ష్మిపార్వతి, నాగలక్ష్మి, రాంబాబు, రాంబాబు, శంకర్ లు పాల్గొన్నారు