కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయాలి *రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కార్యదర్శి లింగంగౌడ్

కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయాలి
*రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కార్యదర్శి లింగంగౌడ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఎన్నో దశాబ్దాలుగా కుల జనగణన చెయ్యాలని బీసీలు ఉద్యమిస్తున్నారని బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీల కులగణన చేయాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన పట్టణంలో మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు కుల జనగణన జరపాలని కోరుతున్నాయని, కులగణన ద్వారానే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నాయీ. బీసీల రిజర్వేషన్లు కుల జనగణనలతోనే సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు సూచిస్తుంది. అధికారంలో భాగస్వామ్యం కులగణన ద్వారానే సాధ్యమవుతుందని ప్రజాఊ సంఘాలు ఉద్యమిస్తున్న, బీసీ ప్రధానమంత్రి మోడీ కుల జనగణనను చేయుటకు ఒప్పుకోవటం లేదని, బిజెపి, ఆర్ఎస్ఎస్ లు కులజనగణను తీవ్రంగా అడ్డుకుంటున్నయన్నారు. బీసీల అధికారం, అభివృద్ధి, అవకాశాలను, రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బిజెపి, ఆర్ఎస్ఎస్ల కుట్ర రాజకీయాలను మనందరం వ్యతిరేకిద్దాం. ఓడిద్దాం. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామన్నారు. కార్యక్రమంలో ఊరిబండి శ్రీనివాస్ యాదవ్, బత్తుల అంజి, రాంబాబు యాదవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking