పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు ట్రాక్ చేయడంలో సీఈఐఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు ట్రాక్ చేయడంలో సీఈఐఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయడంలో
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.నిన్న లాంఛనంగా ప్రారంభమైన (సిఇఐఆర్) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న/ దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని అన్నారు.ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలక పరికరం అయ్యిందని ఏదైనా సమాచారంతెలుసుకోవాలన్న
నగదు లావాదేవీలు చేయాలన్న మొబైల్ ఫోన్ పైనే ఆదారపడేంతగా ప్రాదాన్యం సంతరించుకున్న మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న /చోరికి గురైతే పరిస్తితి ఎలాఉంటుందో ఊహించనవసరం కష్టమేనని అన్నారు.పోయిన ఫోన్ లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ సీఈఐఆర్ అనే అప్లికేషన్ ద్వారా చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి చరవాణి లను వెతికి పట్టుకోవడానికి సీఈఐఆర్ పోర్టల్ దోహదపడుతుందని అన్నారు.
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని “సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్” (సీఈఐఆర్ ) విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇందుకోసం www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్ / స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది దానిపై క్లిక్ చేయాలి. పోయిన చరవాణిలోని నెంబర్లు ఐఎంఈఐ నెంబర్లు, కంపెనీ పేరు, మోడల్ కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, జిల్లా రాష్ట్రం పోలీస్ స్టేషన్ పరిధి ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి చివరగా వినియోగదారుడు పేరు చిరునామా గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడి ఓటిపి కోసం మరో మొబైల్ నెంబరు ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఈ ఐడి ఆధారంగా దర్యాప్తు ప్రక్రియతో పాటు మొబైల్ దొరికిన వివరాలు తెలుసుకోవచ్చు.మొబైల్ ఏ కంపెనీదైనా సీఈఐఆర్ విధానం దాని పని చేయకుండా చేస్తుంది. దాంతో పాటు కేసు చేదనలో పోలీసులకు ఉపయోగపడుతుంది. మొబైల్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్ లోకి వెళ్లి అన్ బ్లాక్/ పౌండ్ మొబైల్ లింకు పై క్లిక్ చేయాలి తర్వాత ఐడి నమోదు చేయగానే అన్ బ్లాక్ అవుతుంది.ఖమ్మం జిల్లాలో మొబైల్ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు రాగా జిల్లా పోలీసులు ఐఎంఈఐ సహాయంతో కాల్ డేటా రికార్డింగ్ తో పాటు ఇతర సాంకేతిక విధానాలను ఉపయోగించి సుమారు 130 ఫోన్ లను గుర్తించి భాధితులకు అప్పగించడం జరిగిందన్నారు.మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలి ఐఎంఈఐ ఆధారంగా దర్యాప్తు చేస్తారు కేంద్రం ప్రవేశపెట్టిన సి ఈ ఐ ఆర్ వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తే త్వరగా మొబైల్ ఫోన్ దొరకడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking