నేడు ముస్లిం సోదరులకు పొంగులేటి ఇఫ్తార్ ధావత్
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈనెల 19న బుధవారం సాయంత్రం 06.00 గంటలకు ఇఫ్తార్ ధావత్ ఇవ్వనున్నారు.ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.ఖమ్మం నగరంలోని మమత హాస్పిటల్ మెయిన్ రోడ్డు లోని హార్వెస్ట్ స్కూల్ ఎదురుగా గల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందుకు నగరంలోని అన్ని డివిజన్లకు చెందిన ముస్లిం సోదరులతో పాటు రఘునాథపాలెం మండలానికి చెందిన ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో హాజరై తమ అతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. ఈ విందుకు పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.