ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ

పినపాక అక్షిత ప్రతినిధి

మండల పరిధి లోని గోపాలరావు పేట గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి శేఖర్ వర్మ, ఎంపీపీ ఎంపీపీ.గుమ్మడి గాంధీతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ మండలం లో కొనుగోలు కేంద్రాలను పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సంఘం సీఈవో సునీల్, అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు దాట్ల వాసు బాబు, గ్రామస్తులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking