సమ్మె సైరన్ మోగించిన జెపిఎస్ – 28 నుండి నిరవధిక సమ్మె బాట దిశగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు – పినపాక ఎంపీడీవో ఇన్చార్జి ఎంపీఓ లకు సమ్మె నోటీస్ అందజేత
సమ్మె సైరన్ మోగించిన జెపిఎస్
– 28 నుండి నిరవధిక సమ్మె బాట దిశగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
– పినపాక ఎంపీడీవో ఇన్చార్జి ఎంపీఓ లకు సమ్మె నోటీస్ అందజేత
పినపాక అక్షిత ప్రతినిధి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మూడేళ్ళ ప్రొబేషనరీ పీరియడ్ ముగిసినా, మరో ఏడాది పొడిగించి నాలుగేళ్లు పూర్తయినప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ సంబంధించిన ఎలాంటి ఆర్డర్స్ రానందున తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్(టీపీఎస్ఎఫ్) పిలుపుమేరకు ఈనెల 28 నుండి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు పినపాక పంచాయతీ కార్యదర్శులు తెలియజేశారు.ఈ సందర్భంగా పినపాక మండల అభివృద్ధి అధికారి పల్నాటి వెంకటేశ్వరరావు, మండల పంచాయతీ అధికారి ఎమ్.జైపాల్ రెడ్డికి, పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ…కరోనా సమయంలో వందశాతం ఓడీఎప్ సాధించడంలో, హరితహారం, పల్లెప్రగతి-పారిశుధ్యం, వందరోజులు పని, గోదావరి వరదలు, పోడుభూముల సర్వే ఇతర పనులు నిర్విరామంగా చేశామని అన్నారు. వెంటనే రెగ్యులరైజేషన్ జీవో విడుదల చేయాలని గడచిన నాలుగేళ్ల ప్రొబేషన్ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించి రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్యదర్శులను జేపీఎస్ గా ప్రమోట్ చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.ఆదినారాయణ, సమ్మయ్య, సాంబశివరావు, అజారుద్దీన్, అశోక్, ప్రశాంతి,రాజు, ఇతర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.