సేవలను గుర్తించి…అవార్డులు బ్రోచర్ ను ఆవిష్కరించిన మల్లారెడ్డి

సేవలను గుర్తించి…అవార్డులు

బ్రోచర్ ను ఆవిష్కరించిన మల్లారెడ్డి

జవహార్ నగర్, అక్షిత ప్రతినిధి :

సామాజిక సేవల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టి విశిష్ట సేవలందించిన సంస్థలు, వ్యక్తులను గుర్తించి మన స్నేహం ఎన్ ఎస్ ఫ్రెండ్స్ గ్రూప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. మే 16న రవీంద్ర భారతి మెయిన్ హాల్లో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ బ్రోచర్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ వికలాంగుల

హక్కుల సాధన సమితి సౌజన్యంతో మన కీర్తి అవార్డ్స్  మంత్రి  తెలంగాణ కార్మిక ఉపాధి మహిళ శిశు అభివృద్ధి శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎంతోమందికి నిరుపేదలకు దివ్యాంగులకు, పారిశుధ్య కార్మికులకు, డాక్టర్లకు, లాయర్లకు, పోలీస్ అధికారులకు, ఉపాధ్యాయులకు, ఆశ వర్కర్లకు, నటి నటులకు వారి సామాజిక  సేవలను గుర్తించి వారికి తగిన గౌరవంతో పాటు  అవార్డ్స్ మే 16 వ తేదీన రవీంద్ర భారతిలో మెయిన్ హాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి టీ.ఎల్.ఎఫ్ ప్రెసిడెంట్ శోభారెడ్డి, జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్,  మన స్నేహం ఎన్ఎస్ ఫ్రెండ్స్ గ్రూప్ అధినేత కావేరి ధర్మేందర్,  తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెరుగు శివకృష్ణ, భువనగిరి జిల్లా అధ్యక్షుడు కనకబోయిన నాగరాజు, వివిధ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking