పౌల్ట్రీ ఫామ్ లో డీసీఎం కింద పడి వ్యక్తి మృతి

పౌల్ట్రీ ఫామ్ లో డీసీఎం కింద పడి వ్యక్తి మృతి

తుంగతుర్తి అక్షిత:

ప్రమాదవశాత్తు డీసీఎం టైర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండల పరిధిలోని కేశవాపురం ఆవాస ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ములుగు జిల్లాకు చెందిన నరసింహ సాగర్ గ్రామం చెందిన జగదీష్ 24 గత కొంతకాలంగా స్నేహ ఫౌండ్రి కంపెనీలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి వెలుగుపల్లి కి చెందిన పాటి రవీందర్ రెడ్డి పౌల్ట్రీ ఫామ్ లీజుకి ఇవ్వగా ,రాత్రి హైదరాబాదు నుండి స్నేహ కంపెనీ కోడి పిల్లలు వచ్చాయి. కొన్ని రూములలో డెలివరీ చేశారు. ఈ క్రమంలో జగదీష్ కు నిద్ర రాగ, ఆరు బయటనే పడుకున్నాడు .గమనించని డీసీఎం డ్రైవర్, రివర్స్ తీసుకోబోతుండగా, డీసీఎం చక్రము జగదీష్ పై భాగం నుండి వెళ్ళింది. దీనితో రక్తస్రావం జరగగా హుటా హుటిన ఆటో పై సూర్యాపేటకు తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృత దేహాన్ని సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రి లో పోస్టుమార్టం చేశారు. తమ్ముడు ఉపేందర్ ఫిర్యాదు మేరకు, డ్రైవర్ అదుపులోకి తీసుకొని, జరిగిన సంఘటనపై విచారణ జరిపి, కేసు నమోదు చేస్తున్నట్లు తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్ తెలిపారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking