జాతీయ నెట్ బాల్ పోటీలకు సాగర్ క్రీడాకారులు

జాతీయ నెట్ బాల్ పోటీలకు సాగర్ క్రీడాకారులు

అక్షిత ప్రతినిధి నాగార్జునసాగర్:

ఈనెల 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు సాగర్ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 9వ తేదీన మహబూబ్ నగర్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు హాజరై సాగర్ కు చెందిన క్రీడాకారులు జూనియర్ విభాగంలో వినయ్, రాజీవ్ ,కృష్ణవేణ సబ్ జూనియర్ విభాగంలో నాగరాజు , సుప్లవిరాజ్, సభానూర్ జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను స్థానిక ఎస్సై రాంబాబు, సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుందరి ,నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, కిరణ్ కుమార్లు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking