వడదెబ్బతో మృతి చెందిన హమాలీ

వడదెబ్బతో మృతి చెందిన హమాలీ

అక్షిత న్యూస్ మాడుగులపల్లి: సల్కనూర్ పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీ పనిచేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా దుర్మరణం చెందిన ఘటన బొమ్మకల్ గ్రామంలోనీ దేవతలబావిగూడెం లో చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలం పరిధిలోని బొమ్మకల్లు గ్రామపంచాయతీలోని దేవతలబాయిగూడెంలో పిఎసిఎస్ సల్కనూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలి గా పనిచేస్తున్న రమావత్ జాను (55) తండ్రి లచ్చయ్య అను వ్యక్తి రోజు మాదిరిగానే సెంటర్లోని ధాన్యాన్ని లోడ్ చేయడానికి వెళ్లి లారీలో లోడ్ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కిందపడి దుర్మరణం పాలయ్యారు అని అన్నారు. మృతునికి ఒక భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. గత వారం రోజులుగా ఎండల ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు, హమాలీలు సేద తీరడానికి ఎలాంటి వసతులను అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్ల పోతు భాస్కరరావు మృతులు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking