రైల్వే గూడ్స్ హమాలీలకు న్యాయం చేయడం కోసం ఆమరణ దీక్షకు సిద్దం ఎమ్మేల్యే నరేందర్

రైల్వే గూడ్స్ హమాలీలకు న్యాయం చేయడం కోసం ఆమరణ దీక్షకు సిద్దం ఎమ్మేల్యే నరేందర్ వరంగల్,అక్షిత బ్యూరో : రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ కార్మికులకు అండగా ఉంటా, మీకు న్యాయం జరుగడం కోసం అవసరమైతే ఆమరణ నిరహార దీక్షకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను -ఎమ్మెల్యే నరేందర్ కార్మిక బిడ్డను కాబట్టి హమాలీ కార్మికుల కష్టాలు తెలిసిన వాడిని…
-మీలో ఒక్కడిని మీ కష్టాలపై మీ అందరి తరుపున నేను కొట్లాడ్తా.వరంగల్ రైల్వే స్టేషన్ లోని రైల్వే గూడ్స్ షెడ్ లో వరంగల్ సౌత్ సెంట్రల్ రైల్వే షావుకారి హమాలీ యూనియన్ వారు గూడ్స్ షెడ్ చింతలపల్లి కి తరలింపు పై మరియు అందులో పనిచేస్తున్న 225 మంది హమాలీలు జీవనోపాధి కోల్పోతాము అని దానిని చింతలపల్లి కి తరలించిన యెడల మా 225 మందికి అందులో ఉపాధి కల్పించేలా కృషి చేయాలనీ వారి సమస్యల పట్ల ఎమ్మెల్యే నరేందర్ ని కోరడం జరిగింది.

వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మీకు తోడుగా ఉంటా అవసరమైతే మీకు న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధం గా వున్నాను. మీకు తోడుగా ఉంటా మీ కష్టాల పై నేను కొట్లాడ్తాను అని ఎమ్మెల్యే గారు తెలిపారు.ఈ కార్యక్రమం లో కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి,సోమిశెట్టి ప్రవీణ్,జడ్ ఆర్ సి మెంబెర్ చింతాకుల సునీల్, యూనియన్ గౌరవ అధ్యక్షులు కక్కే సారయ్య, అధ్యక్షులు అయూబ్ ఖాన్, శివ, రాజశేఖర్, హరి, దేవేందర్ యూనియన్ హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking