పుట్టినరోజు సందర్బంగా అనాధలకు, పేదలకు అన్నదానం చేసిన ముత్యాల వెంకటేష్

పుట్టినరోజు సందర్బంగా అనాధలకు, పేదలకు అన్నదానం చేసిన ముత్యాల వెంకటేష్ నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల పెద్ద సాయిలు చిన్న కుమారుడు ముత్యాల వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా రోడ్డు పక్కన వున్నా అనాధలకు,వృద్దులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వృద్ధుల ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేష్ మాట్లాడుతూ…. నా పుట్టినరోజు వేడుకను అందరి లాగా రోడ్ల మీద కేక్ కట్ చేసి, దావత్ లు చేసుకోవడం నాకు ఇష్టం లేదు.రోడ్డు పక్కన వున్నా అనాధలకు ఒక్క పూట భోజనం పెట్టడం ఆనందంగా ఉందని, పుట్టినరోజు వారికి సేవ చేసే భాగ్యం కలిగినందుకుభాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందని, వారికి సేవ చేసే భాగ్యాన్ని నా పుట్టినరోజు నాడు కలిగించినందుకు భగవంతునికి కృతజ్ఞత లు తెలియజేశారు.

మానవసేవే మాధవసేవ అనే సామెత వినడమే జరిగింది కానీ నా పుట్టినరోజు వృద్ధులకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలలో ఉన్న తృప్తి వర్ణనాతీతమని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking