ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోరా? కాంట్రాక్టర్ పై తండా వాసుల ఆగ్రహం

ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోరా?

కాంట్రాక్టర్ పై తండా వాసుల ఆగ్రహం

మద్దూరు అక్షిత న్యూస్:

మండలంలోని హనుమ తండా గ్రామపంచాయతీ పరిధిలోని షిబ్బి తండాలో ఇటీవల నిర్మించిన సిసి రోడ్ల పక్కన మట్టి పోయకుండా వదిలి వేయడంతో వృద్దులకు,పిల్లలకు గాయాలైన సదర్ కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నేలలు గడుస్తున్నా కాంట్రాక్టర్, పి అర్ ఏ ఈ ఇటు వైపు రాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులకు గురవుతున్నారనీ తండా యువ నాయకుడు చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెప్పి బిల్లు ఇవ్వడంతోనే కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.తక్షణమే సి సి రోడ్డుకు ఇరువైపులా మట్టి పోసి తండా వాసులను ప్రమాదాల నుంచి కాపాడాలని అయన కోరారు. లేని పక్షంలో సి సి రోడ్డుపై తండా వాసులతో ఆందోళన చేపడతమని చిరంజీవి హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking