కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శం* ఇంద్రపాలనగరం లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం

కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శం*

ఇంద్రపాలనగరం లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

కంటి వెలుగు దేశానికే ఓ గొప్ప పథకమని రామన్న పేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం అన్నారు. మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామం లోని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని బుధవారం ఎంపీపీ ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం మాట్లాడుతూ అందత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కేసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు రెండో కార్యక్రమాన్ని ప్రారంభించారని అమే తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటపల్లి సిద్ధమ్మ యాదయ్య, వైస్ ఎంపీపీ నాగాటి ఉపేందర్,ఎంపీటీసీ పూస బాలమని బాల నరసయ్య, ఉప సర్పంచ్ గర్దాసు సురేష్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గర్దాస్ విక్రమ్ కార్యదర్శి రవ్వ నర్సింహ , మార్కెట్ డైరెక్టర్లు దశరథ, రాస వెంకటేశం,నాయకులు విద్యాసాగర్ రెడ్డి, మల్ల మల్లేశం మీర్జా కాజా సింగన బోయిన జంగయ్య ,యాదయ్య ,మల్లయ్య, నల్ల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking